సాధారణంగా కాఫీ తాగితే మూడ్స్ మెరుగుపడి... కాస్తంత రిలాక్స్‌గా ఉంటుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే, కాఫీ అతిగా తాగితే నానా ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల మితంగా మాత్రమే కాఫీ సేవనం కావించాలని వైద్య నిపుణులు చేసే హెచ్చరికలూ మనకు తెలుసు.
అయితే, కాఫీ తాగే వారు ఇవేమీ పట్టించుకోనక్కర్లేదు. మూడ్ బాగా లేకపోయినా, తలనొప్పిగా ఉన్నా మొహమాటం లేకుండా కాఫీ సేవించవచ్చు. ఎందుకంటే కాఫీ తాగితే కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.