Vishwaksen, S Radhakrishna, Talasani Srinivas Yadav, Allu Aravind
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఇప్పటికే ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ #CULT కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశ్వక్సేన్ దర్శకుడిగానే కాదు కథ కూడా స్వయంగా రాసుకున్నారు. 40 మంది న్యూ కమ్మర్స్ ని పరిచయం చేస్తూ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.