తాజా సమాచారం మేరకు ఆదివారం నుంచి హైదరాబాద్ దగ్గర కీసరలోని కొత్తగా రూపొందించిన రాజ్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. గతంలో చేసిన కొన్ని సన్నివేశాలను రీష్యూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, నిన్నటి నుంచి జరుగుతున్న షూట్ లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు. ప్రభాస్, సంజయ్ దత్ తోపాటు జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్ మేన్స్ పాల్గొన్నారని తెలిసింది. 14రోజులపాటు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరగనుంది.
నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాలో రిద్ది కుమార్, మాళవిక మోహన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో టి.జి. విశ్వప్రసాద్ నిర్మాత. కాగా, ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ తోపాటు హార్రర్ ఎలిమెంట్ వుందని తెలుస్తోంది.