కరోనా వేళ.. గట్టిగా కూడా మాట్లాడకూడదట.. తుంపరులు..?

గురువారం, 14 మే 2020 (14:27 IST)
అవునా..? అని అడిగితే యస్ అనే సమాధానం ఇస్తున్నారు వైద్యులు. మాట్లాడటం ద్వారా నోటి నుంచి బయటకు
coronavirus
వచ్చే తుంపరులు ఎనిమిది, అంతకంటే ఎక్కువ నిమిషాల పాటు గాలిలో ఉంటాయని తద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సులభంగా వ్యాపిస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

విషయం ఏమిటంటే? మామూలు సంభాషణల ద్వారా నోటి నుంచి వెలువడే చిన్న చిన్న తుంపరల కారణంగా కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ అండ్‌ డైజస్టివ్‌ అండ్‌ కిడ్నీ డిసీజెస్‌ అండ్‌ ది యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
బిగ్గరగా మాట్లాడటం ద్వారా ఒక సెకనుకు వేలాది తుంపరులు వెలువడుతాయని.. ఈ పరిశోధనల్లో కరోనా, ఇతర వైరస్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోయినా.. సంభాషణల ద్వారా వెలువడ్డ తుంపరలలోని క్రిముల కారణంగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
సంభాషణల ద్వారా గాలిలోని తుంపరల్లో ఉన్న వైరస్‌ల కారణంగా ఏ ఇన్ఫెక్షన్ సోకడానికైనా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కూడా మాస్కులు ధరించని వారిపై ప్రభావం ఉంటుంది. మాస్కులు లేకుండా బిగ్గరగా మాట్లాడేవాళ్లు ఇతరులను కచ్చితంగా ప్రమాదంలో పడేస్తున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తద్వారా కరోనా వంటి వైరస్‌లు సులంభం వ్యాపించే అవకాశం వుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు