వేసవి వచ్చేస్తోంది. వేసవిలో కీరదోసను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సిన పీచు లభిస్తుంది. కీర దోసలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. కాఫీ, టీలకు బదులు కీర ముక్కలను తీసుకుంటే ఉదర సమస్యలుండవ్. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ పండ్లు కూరగాయలను తీసుకోవాలి. వీటితో పాటు కీరదోసను తీసుకోవాలి.
అలా చేస్తే కీరలో ఉండి నీటి శాతం శరీరం డీహైడ్రేడ్ కానివ్వదు. వ్యర్థాలు కూడా బయటికి తొలగిపోతాయి. చర్మానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా.. కళ్ల కింద నల్లచారలు రాకుండా కాపాడుతుంది కీరదోస కాయ. అందుకే అప్పుడప్పుడు కీర ముక్కల్ని కళ్ల మీద పెట్టుకుంటే స్వాంతన లభిస్తుంది.
మొండి క్యాన్సర్లకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. రోజుకు ఒకటి చొప్పున దీన్ని తీసుకుంటే.. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వచ్చే తలనొప్పి ఉండదు. హ్యాంగోవర్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా కొన్ని తాజా కీర ముక్కల్ని తింటే.. అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఎందుకంటే జీర్ణప్రక్రియకు కావాల్సిన పీచు పదార్థం లభిస్తుంది కాబట్టి మలినాలు తొలగిపోయి.. బరువు తగ్గుతారు.