ఒత్తిడిని తగ్గించడంలో కరివేపాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి మెదడుకు క్యాల్షియం సరఫరా చేసి మనసును ఎంతో హాయిగా ఉంచుతుంది. కరివేపాకులో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, ఏ, బి, సి విటమిన్ పుష్కలంగా వుంటాయి.
కరివేపాకు ఎక్కువగా తింటే రక్తం పలుచగా మారి గుండెకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా నూనెలో కరివేపాకు వేసి, బాగా మరిగించి రోజూ ఆ తైలాన్ని తలకు రాసుకుంటే క్రమ క్రమంగా జుట్టు నల్లబడుతుంది.