వంటల్లో కరివేపాకుని ఉపయోగించడంతో పాటు జుట్టు సమస్యలకి, అందానికి కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కరివేపాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరివేపాకులో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
జుట్టు సమస్యలకు కూడా కరివేపాకు మంచి పరిష్కారం చూపిస్తుంది. శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకులు తరిమేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెడతాయి. కరివేపాకు దగ్గు, జలుబును దూరం చేస్తుంది.