ఇంకా కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. ఖర్జూరాలు ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఖర్జూరాలు జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.