డయాబెటిస్‌ అదుపుకి ఏ ఆహారం ప్రయోజనకరం?

గురువారం, 17 నవంబరు 2022 (22:34 IST)
మధుమేహం లేదా షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి మీరు ఈ 8 పదార్థాలను తీసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
నేరేడు విత్తనాలు: ఇవి తీసుకుంటే షుగర్ లెవల్స్ క్రమేణా తగ్గుతాయి.
 
మెంతులు: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఇవి తగ్గించగలవు.
 
వెల్లుల్లి: ఇది కూడా మదుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది.
 
ఉసిరి: ఉసిరి మధుమేహానికి వ్యతిరేకం. ఇది రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
 
వేప ఆకులు: రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
 
కలబంద: మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
దాల్చిన చెక్క: ఇది కూడా షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడుతుందని చెపుతారు.
 
కాకరకాయ: ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు