చాలా మంది దాహం వేయకపోయినా పదేపదే నీళ్లు తాగుతుంటారు. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు చెప్పే సూచనను పాటించే క్రమంలో ఈ పని చేస్తుంటారు. కానీ, దాహం వేయకపోయినా అతిగా నీళ్లు తాగితే అవి విషంతో సమానమని వైద్యులు చెపుతున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా, విక్టోరియాలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ సర్వే చేయించారు.
రోజుకు 8 గ్లాసులు నీళ్లు తాగాలని డాక్టర్లు సూచించటం కూడా తప్పేనంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. ఏదో అల్లాటప్పాగా చెప్పటం లేదని.. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని చెబుతున్నాని పరిశోధకులు చెపుతున్నారు. ఇదే అంశంపై రెండు రకాలుగా పరిశోధనలు చేశారంట. ఒకటి దాహం వేసినప్పుడు నీళ్లు తాగేవారిపై.. దాహం లేకపోయినా తరచూ నీళ్లు తీసుకునే వారిపై వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. దాహం వేయకపోయినా నీళ్లు తాగేవారిలో మార్పులు గమనించారంట.
* దాహం అయినప్పుడే నీళ్లు తాగిన వారి శరీరంలో నీటి శాతం సమతూకంగా ఉంది.
* దాహం లేకపోయినా నీళ్లు తాగితే.. మొదట మెదడు చురుగ్గా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా నీరు విషంగా మారి మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది.
* నీరు అధికమవుతే అది విషంగా మారే అవకాశం ఉంది.
* ఎక్కువ నీళ్లు తాగితే రక్తంలో సోడియం శాతం తగ్గిపోతుంది.
* తరచూ నీళ్లు తాగుతుంటే.. హైపోనెట్రేమియా అనే వ్యాధి వస్తుంది.
* దాహం లేకపోయినా నీళ్లు తాగేవాళ్లలో జలుబు, ముక్కు కారడం, తల బరువుగా ఉంటుంది.
* హైపోనెట్రేమియా అనే వ్యాధి వస్తే.. చివరి దశలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
* అంటే నీరు అధికంగా తాగడం వల్ల జలం ప్రాణం తప్పదంటున్నారు. అదే ఎక్కువైతే విషం అని తేల్చారు. సో.. నీళ్లు అవసరాన్ని బట్టి తాగాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.