ఇటీవల ఎట్ రిస్క్ దేశాల నుంచి 12 వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 104 మందికి కరోనా నిర్ధారణ కాగా, 82 మందిలో ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వీరి శాంపిల్స్‌ను బెంగుళూరుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ 82 మందిలో 34 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు తేలింది.
దీంతో దేశంలో అత్యధిక సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి చేరుకుంది. అలాగే, చెన్నై, కీల్పాక్కం ఆస్పత్రిలో ఒమిక్రాన్ వైరస్ సోకి చికిత్స పొందుతూ వచ్చిన రోగి పూర్తిగా కోలుకున్నాడు. అయితే, అతన్ని డిశ్చార్జ్ చేసే విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల కోసం ఆస్పత్రి వైద్యులు ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా 82 మందిలో 34 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంతేకాకుండా, మిగిలిన వారి ఫలితాలు రావాల్సివుందని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. మరోవైపు, విదేశాల నుంచి చెన్నైకు వచ్చే వారికి ఎయిర్‌పోర్టులోనే రెండు దశల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతిస్తున్నారు.