రోజూ కోడిగుడ్లు తీసుకుంటే.. ఒబిసిటీ పరార్

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (23:01 IST)
రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చు. కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి.రోజుకి కేవలం రెండు కోడిగుడ్లు తీసుకొంటే శరీరం అద్భుతంగా పని చేస్తుంది. కోడిగుడ్ల సాటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. 
 
బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకున్న వాళ్లు మిగిలిన రోజులో కేలరీలు తక్కువగా తీసుకుంటారని.. తద్వారా బరువు కూడా పెరగరని.. ఒబిసిటీ వేధించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. 
 
కోడిగుడ్డు మెదడుకు చురుకుదనం పెంచుతుంది. శరీరంలో అన్ని రకాల కణజాలాల తయారీకీ కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. గుండె జబ్బులు తగ్గాలంటే.. తప్పకుండా రోజుకో కోడిగుడ్డు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు