ఆర్ఎంపీ వైద్యులూ.. జర జాగ్రత్త.. కరోనాకు వైద్యం చేస్తే వేటే?

శనివారం, 11 ఏప్రియల్ 2020 (13:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో రాష్ట్రంలోని ఆర్ఎంపీ వైద్యులకు కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. జలుబు, జ్వరం, దగ్గుతో వచ్చే వారికి వైద్య చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్ఎంపీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ ఆదేశాల్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, "ఆర్‌ఎంపీలు కరోనా లక్షణాలు వ్యక్తులకు వైద్యం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కరోనా లక్షణాలున్న వ్యక్తుల సమాచారం స్థానిక వైద్య సిబ్బందికి ఇవ్వాలి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకూ ఒక కరోనా ఆస్పత్రి ఉంది. అందుబాటులో 4 రాష్ట్రస్థాయి కరోనా ఆస్పత్రులు ఉన్నాయి. 
 
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకుంటాం. వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది" అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు