పనులు ప్రాత:కాలంలోనే మొదలుపెట్టి ఎండముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు మన పూర్వీకులు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వాటిని సూర్యోదయం కాక ముందునుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట పెరుగుతుంది. ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతచిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. న్యూరోట్రాన్స్ మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్‌ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది.
ఇక ఉదయపు సూర్యకాంతి విటమిన్-డి ఉత్పాదనకు తోడ్పడుతుంది. ఆ వేళలో ప్రసరించే అల్ట్రా వయులెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మంచిది.