ఈ 5 పాయింట్లు తెలిస్తే గోధుమ గడ్డి రసాన్ని తాగుతారు... (Video)

మంగళవారం, 30 జూన్ 2020 (23:36 IST)
ఆరోగ్యానికి ఇంగ్లీషు మందులు, విటమిన్ మాత్రలకు బదులుగా సహజసిద్ధంగా లభించేవి తీసుకుంటే ఎంతో మేలు. వాటిలో గోధుమ గడ్డి కూడా ఒకటి. ఈ గోధుమ గడ్డిని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలలో పెంచుకుని ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. గోధుమ గడ్డి రసాన్ని రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.
 
2. గోధుమగడ్డి రసంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
 
3. జీర్ణాశయం, ప్రేగుల్లో అల్సర్ల సమస్య ఉన్నవారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది.
 
4. గోధుమగడ్డి రసాన్ని తాగితే అనీమియా రాకుండా ఉంటుంది. రక్తం స్థాయి పెరుగుతుంది.
 
5. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గిస్తుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు