ఆకుకూరల్లో మేలైనది పాలకూర. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో వుండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ శరీరానికి మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు ఇది సరైనది. మెదడు చురుగ్గా అయ్యేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్‌తో పోరాడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది.