అవాంఛిత గర్భాలతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీఐ)ను నిరోధించేందుకు తమ భార్యలతో పురుషులు శృంగారం చేసే సమయంలో కండోమ్స్ వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల సెక్స్‌లో కొందరికి సంతృప్తి లేకపోయినప్పటికీ మరోమార్గం లేక కండోమ్ వాడుతూ శృంగారంలో పాల్గొంటారు. ఇపుడు మహిళలకు కూడా కండోమ్స్ వచ్చేశాయి. దీన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరుతో తయారు చేస్తారు. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంతో మృదువుగా ఉండటం వల్ల స్త్రీ యోనిభాగంలోకి సులభంగా వెళుతుంది.
కండోమ్ బయటి వలయాన్ని పట్టుకుని, కండోమ్ లోపలి వలయాన్ని కొద్దిగా చుట్టిముట్టి జాగ్రత్తగా యోనిలోకి జొప్పించాలి. ఆ తర్వాత కండోమ్ పూర్తిగా యోనిలోకి వెళ్లిందా లేదా అని చెక్ చేయాల్సి వుంటుంది. శృంగారం తర్వాత ఈ కండోమ్‌ను జాగ్రత్తగా వెలుపలికి తీయాల్సివుంటుంది. ఒకసారి వాడిని కండోమ్‌ను మరోమారు వాడేందుకు ప్రయత్నించవద్దు. అయితే, సెక్స్ సమయంలో ఉపయోగించే కండోమ్‌లు నాణ్యవంతంగా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. అలాకాని పక్షంలో శృంగారం మధ్యలో అవి చినికిపోయి వీర్యం యోనిలోకి వెళ్లే అవకాశం ఉంది.