అలాగే సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. తలలో చుండ్రును తగ్గించడానికి మెంతులు సహాయపడతాయి. కిడ్నీ, మూత్రాశయ వ్యాధులకు మెంతులు దివ్య ఔషధం. కడుపు నొప్పిని తగ్గించే గుణం మెంతులకు ఉంటుంది.
మెంతులని నీళ్లతో కలిపి పైపూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీముపొక్కులు, ఎముకలు విరగడం, కీళ్ల వాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. మెంతులతో తయారు చేసిన తేనీరు తీసుకోవడం వాళ్ళ శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.