అబ్బాయిల కంటే అమ్మాయిలే డేటింగ్‌కు తొందరపడుతున్నారట. ఈ విషయాన్ని నార్వేజియన్ వర్శిటీ పరశోధకులు తేల్చారు. పది నుంచి 29 సంవత్సరాల వయస్సులోని అమ్మాయిలు, అబ్బాయిలపై జరిపిన పరిశోధనలో.. డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కావాలని యువత కోరుకుంటోందని, వీరికి అందుబాటులో ఉన్న ''టిండర్'' అనే యాప్ హాట్ ఫేవరెట్ అని పరిశోధకులు తేల్చారు.
ఈ యాప్‌ను అధికంగా అమ్మాయిలే వాడుతున్నారని.. డేటింగ్ కోసం అమ్మాయిలు.. అబ్బాయిల వ్యక్తిగత వివరాలు.. వృత్తి నేపథ్యాలను పరిశీలించిన తర్వాతే వారు ఓ నిర్ణయానికి వస్తున్నారని తెలిపారు. కానీ ఇందుకు భిన్నంగా అబ్బాయిల పరిస్థితి వుంది. ఒకేసారి ఎక్కువ మందిని పరిచయం చేసుకుంటున్న వారు.. వారిని ఎప్పుడు కలవాలా అని ఆరాటపడుతున్నారని తేల్చారు.
ఒకరు నచ్చకుంటే, వెంటనే మరొకరికి ప్రపోజ్ చేసే విషయంలోనూ అబ్బాయిలే ముందుంటున్నారట. అయితే, అతి కొద్ది మంది మాత్రం తమకు నచ్చే అమ్మాయి దొరికే వరకూ నిరీక్షిస్తున్నారని, వీరిలో కొందరు మనసుకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి వెళ్తున్నారని తేలింది. స్వల్పకాలిక సంబంధాలను, లైంగిక కోరికలను తీర్చుకునేందుకే టిండర్ అనే యాప్‌ను చాలామంది ఆశ్రయిస్తున్నారని పరిశోధనలో వెల్లడి అయ్యింది.