జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది.
* జామపండు చెట్టులోని ఆకులు 25 మేర తీసుకుని నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులు మటుమాయమై పోతాయి. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం జామకాయలో పుష్కలంగా ఉంది.