అలసందలు తింటున్నారా లేదా? ఎందుకంటే?

శనివారం, 3 డిశెంబరు 2022 (19:20 IST)
అలసందలులో పోషక విలువలు అమోఘంగా ఉంటాయి. దీనిలోని పీచుపదార్దం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. అలసందలులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
 
అలసందల్లో పుష్కలంగా లభించే మిటమిన్ కె మెదడు చురుకుగా పని చేయడంలో దోహదపడుతుంది.
 
అలసందల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.
 
మధుమేహంతో బాధపడే వారికి లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం.
 
అలసందలు తినటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
 
అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి.
 
ఫ్లెవనాయిడ్స్, మినరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
 
కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే ఫలితం కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు