ఇందులోని మెగ్నీషియం, మాంగనీసు, ఐరన్ వంటి ఖనిజాలు గర్భం ధరించిన వారికి చాలా అవసరం. ఇవి సంతానం కలిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. హైబీపీని అంజీర నియంత్రిస్తుంది. తద్వారా రక్త పోటు అదుపులో ఉండటమే కాకుండా పిల్లలు పుట్టడానికి కూడా సహకరిస్తుందట.
అంజీరలో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సరిగా జరగడమే కాకుండా, పీచు పదార్ధం వల్ల శరీర పని తీరు కూడా మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధ పడుతున్న వారికి కూడా అంజీరా భలే ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. ఈ పండు తినడం వల్ల ఆకలి శాతం తగ్గుతుంది. దాని వల్ల మీరు చాలా తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఎండు అంజీరా కానీ, అంజీరా పండు కానీ ఎన్ని తిన్నా ఏమీ కాదు. వీటిలో కొలెస్ట్రాలు శాతం అసలు ఉండవు కాబట్టి, శరీరానికి ఎలాంటి హాని జరగనివ్వవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.