చేపలతో కాలేయ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును...

గురువారం, 23 ఆగస్టు 2018 (16:17 IST)
అత్యంత సులువుగా జీర్ణమై, అమితమైన శక్తిని ఇచ్చే వాటినే గొప్ప ఆహారంగా తీసుకుంటాం. అలా చూస్తే వాటిల్లో ప్రథమ స్థానం చేపలదే అవుతుంది. ఎందుకంటే శక్తినిచ్చేవిగానే కాకుండా ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్టే ఔషధంగా కూడా చేపలు ఉపయోగపడుతాయి. చేపల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
 
జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే సంచికలోని ఒక వ్యాసంలో చేపల వలన కలిగే మరికొన్ని ఆరోగ్య విషయాలను తెలియజేశారు. చేపల్లో శరీరానికి అందే ఒమేగా-3 మనిషి ఆయుష్షును పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. దాదాపు 15 ఏళ్లుగా అధిక మెుత్తంలో చేపలు తినే పురుషుల్ని పరిశీలిస్తే వారిలో హృద్రోగాల వలన మరిణించే వారి సంఖ్య 10 శాతం తగ్గినట్లు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
క్యాన్సర్ వ్యాధులతో మరణించే వారి సంఖ్య 20 శాతానికి తగ్గినట్లు పరిశోధనలో చెబుతున్నారు. అన్నింటికన్నా మిన్నగా పురుషుల్లో కాలేయ వ్యాధి మరణాల సంఖ్య 37 శాతం తగ్గినట్లు వారు కనుగొన్నారు. ఇదంతా చేపలు తీసుకోవడం వలనే జరిగింది. ముఖ్యంగా స్త్రీలలో గుండె సంబంధిత వ్యాధులు 10 శాతం, అల్జీమర్ మరణాలు 38 శాతం తగ్గినట్లు పరిశోధనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు