గో మూత్రంలో ఏముంది?

మంగళవారం, 4 జులై 2017 (13:59 IST)
హిందువులు ఆవును దైవంగా భావించి పూజిస్తారని తెలిసిందే. ఆవులో సకల దేవతలు ఉంటారనేది వారి నమ్మకం. అందుకే హిందువులు ఆవును దైవంగా భావించి కొలుస్తారు. గోవు మూత్రానికి కూడా హిందువులు అంతే  విలువనిస్తారు.  గోమూత్రం సేవిస్తే సకల రోగాలు తొలగుతాయని నమ్ముతారు. ఆవు మూత్రం కలిగే ప్రయోజనాలు సైంటిస్టులు పరిశీలించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఆవుమూత్రంలో శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఇన్షెక్షన్లను కూడా నయం చేస్తాయి. క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి గోవు మూత్రానికి ఉంటుంది. మన శరీరంలో కూడా వాత, పిత్త అసంతుల్యత వల్ల అనేక రకాల రోగాలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే వీటిని సమతుల్యం చేసే శక్తి గోవుమూత్రంలో ఉంటుంది. కాలేయం కూడా శుభ్రమవుతుంది. కాలేయంలోని వ్యర్థ విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. 
 
గో మూత్రంలో పొటాషియం, కాల్షియం, యూరియా, ఫ్లోరైడ్, అమ్మోనియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల మన శరీరంలో ఎన్నో సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదు శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు. అంతే కాదు చర్మసంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. మొటిమలు, మచ్చలు పోతాయి. గాయాలు మరింత త్వరగా మానిపోతాయి. జీవ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గోమూత్ర విశేషాలన్నో.

వెబ్దునియా పై చదవండి