ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందే రామ మందిరాన్ని నిర్మిస్తామని తెలిపారు. సంత్ సమ్మేళన్ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, సహనంతో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచాన్ని నడిపిస్తున్నది రాముడేనని.. ఆయన అనుగ్రహంతో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని యోగి వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ, చట్టసభల వ్యవస్థలు తమతమ పాత్రను పోషిస్తున్నాయని.. వాటి పరిధులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నారు.