నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. వ్యాయామం తప్పక చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. నెలసరికి వారం ముందు నుంచే పొత్తి కడుపు నొప్పి, కాళ్లు నొప్పులు ఎదుర్కొనే మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనని వారు చెప్తున్నారు.
నెలసరి నొప్పులకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. పోషకాహార లోపంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంకా కాలుష్యం, మానసిక ఒత్తిడి కూడా మహిళల్లో నెలసరి నొప్పుల్ని మరింత పెంచుతాయి. ఈ నెలసరి నొప్పులను నియంత్రించాలంటే., వ్యాయామం తప్పనిసరి. వ్యాయామంతో కండరాలు వదులవుతాయి. ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు తగ్గుతాయి.
నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్ ప్యాడ్‌తో కాపడం వలన మంచి ఫలితం ఉంటుంది. నెలసరి ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసినా కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా.. నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మహిళలు ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.