వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల వలన అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్స్, ఫ్లూ వంటి వ్యాధులు వస్తుంటాయి. వాతావరణం చల్లగా ఉండడ వలన బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో అల్లం చాలా ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి తలనొప్పి, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఈ కాలంలో అధికంగా అల్లాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చిటికెడు పసుపును కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీయల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. గ్లాస్ నీటిలో స్పూన్ నిమ్మరసం, తేనె కలుపుకుని తీసుకుంటే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు.