ఉదయం పూట పెరుగు తీసుకుంటే బరువు తగ్గుతారా?

సోమవారం, 10 అక్టోబరు 2016 (14:11 IST)
ఉదయం పూట తీసుకునే ఆహారంతో బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం పూట పెరుగు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు. పెరుగులోకి ప్రోబయోటిక్స్ ద్వారా శరీర బరువు తగ్గుతుంది. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక ఆపై పెరుగు తీసుకోవాలి. 
 
అలాగే ఉదయం పూట అటుకులు, గుడ్డు, ఓట్స్ వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బరువు తగ్గుతారు. దంపుడు బియ్యాన్ని వండుకుని తినడం ద్వారా బరువు పెరుగుతామనే భయం ఉండదు. బాదం పప్పుల్ని రోజూ ఉదయం  తీసుకుంటే వీటిలోని విటమిన్-ఇ పుష్కలంగా అందుతుంది. కొవ్వును కరిగించడంలో పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. పైగా రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇక ఓట్స్‌లోని పీచు ఆరోగ్యానికి మేలు చేస్తే.. లో క్యాలరీలు బరువును తగ్గిస్తాయి. 
 
ఇకపోతే అటుకులను కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఇవి తేలికగా జీర్ణం చేయడంతో పాటు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి