చాలామంది నేను లావుగా ఉన్నాను. నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను ఇక నుంచి డైటింగ్ చేయాలి అంటుంటారు. అంటే తిండి తినడం తగ్గించడమన్నమాట. అయితే శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకోవడం తప్పనసరి అంటున్నారు వైద్య నిపుణులు. అందంగా, సన్నగా, నాజూగ్గా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు డైటింగ్ చేస్తుంటారు.
టీనేజ్ అమ్మాయిలు కడుపునిండా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా అయితే ఎనిమిక్‌గా తయారవడమే కాకుండా మొహంలో మెరుపు, కళ్ళలో కాంతి తగ్గిపోతాయట. శరీరానికి శక్తినిచ్చే క్యాలరీలను తీసుకోకుండా తగ్గించి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కాదని, కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు ఎక్కువగా తినకుండా ఉంటే మంచిదంటున్నారు.
కొన్నిరోజులు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుని ఆ తరువాత మామూలుగా తినడం మొదలుపెడితే జీర్ణకోశానికి మంచిది కాదట. ఒళ్ళు రావడం అనేది ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని, హార్మోన్లను బట్టి ఉంటుందట. కానీ ఆహారం వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల అసలు డైటింగ్ చేయడం అంత అవసరం కాదంటున్నారు.