చీమలకు....
చీమలు ఘాటు వాసన తట్టుకోలేవు. కాబట్టి దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలను చీమలు తిరిగే చోట, కిటికీ పగుళ్ల వద్ద వుంచాలి. అలా వుంచితే చీమలు అటువైపు రావు. చీమలు పూర్తిగా ఇంట్లో నుంచి పారిపోయే వరకూ వీటిని 3 రోజులకోసారి మారుస్తూ వుండాలి.
బొద్దింకలను పారదోలేందుకు....
రెండు కప్పుల నీళ్లలో కప్పు తులసి ఆకులు మరగబెట్టి, ఆ నీళ్లను కిటికీ అంచులు, సింక్ పైపులు, మూలల్లో స్ప్రే చేయండి. అంతే.