శీతాకాలంలో ఖర్జూరాలు తీసుకుంటే.. గోరువెచ్చటి పాలతో?

శనివారం, 30 జనవరి 2021 (19:29 IST)
శీతాకాలంలో ఖర్జూరాలు తీసుకుంటే.. శరీరానికి వెచ్చదనాన్ని పంచుతాయి. చలికాలంలో చర్మం సాగే గుణాన్ని పరిరక్షించడంతోపాటు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చలికాలంలో చాలామంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఖర్జూరం తింటే మంచిది. 
 
వీటిల్లోని పీచుపదార్థాల వల్ల వీరి జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. వీటిల్లో సహజమైన గ్లూకోజ్‌తో పాటు పీచు, మరెన్నో న్యూట్రియంట్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్‌, పొటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాల నిధి ఖర్జూరం. ఇవి చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. 
 
బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను ఖర్జూరాలు సమతులం చేస్తాయి. వీటిని అతిగా తింటే శరీరం బాగా బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగు మించి వీటిని తినకుండా ఉంటే మంచిది. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలతో పాటు రెండు ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు. నేచురల్‌ స్వీట్‌నట్స్‌ అయిన ఖర్జూరాలను సలాడ్స్‌, డెజర్టులలో వాడితే మరెంతో రుచిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు