శీతాకాలంలో పిల్లల కోసం.. పరగడుపున దానిమ్మ పొడిని..?

సోమవారం, 4 జనవరి 2021 (18:59 IST)
Pomegranate
శీతాకాలంలో పిల్లల కోసం ఈ చిన్ని చిట్కాలను పాటిస్తే.. ఫ్లూ రుగ్మతల నుంచి దూరం కావచ్చు. పిల్లలు దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగించాలి. ఇది శరీరానికి తక్షణం శక్తినివ్వడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 
 
పిల్లలకు రోజూ సగం గ్లాసు క్యారెట్ రసంలో అంతే మోతాదు టోమాటోల రసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇది సహజమైన టానిక్. పిల్లల్లో తరచుగా కడుపులో నులి పురుగులు చేరుతుంటాయి. 
 
దీనికి దానిమ్మ చెక్కు చక్కని ఔషధం. దానిమ్మ చెక్కును ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో దానిమ్మ పొడిని కలుపుకుని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగుతుంటే రక్తం శుద్ధి అవుతుంది. కడుపులో నులి పురుగులు చేరవు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు