ఎక్కిళ్లకు చెక్ పెట్టాలంటే.. శొంఠి, తేనెను కలిపి..?

గురువారం, 30 మే 2019 (18:13 IST)
ఏదో ఒక సందర్భంలో ఎక్కిళ్లు అందరికీ వస్తాయి. వాటిని పోగొట్టడానికి తోటివారు ప్రయత్నాలు కూడా చేస్తారు. సడెన్‌గా షాకింగ్ న్యూస్ చెప్పడం వంటివి చేస్తారు. మన మెదడుకు ఆ షాకింగ్ న్యూస్ వెళ్ళి మిగిలిన ప్రక్రియ ఆగిపోతుంది. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు తినడం కష్టమవుతుంది. తినాలనిపించింది తృప్తిగా తినలేము. 
 
కొన్ని ఎక్కిళ్లు సాధారణంగా ఆగిపోయినా. కొన్నిసార్లు మాత్రం ఎంత ప్రయత్నించినా తగ్గవు. కొంత మందికి తరచుగా కూడా వస్తుంటాయి. చిన్నపిల్లలకైతే చాలా సందర్భాల్లో వస్తాయి. శొంఠి ఎక్కిళ్లకు బాగా పనిచేస్తుంది. శొంఠిని పొడి చేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు ఆగిపోతాయి. అంతే కాదు శొంఠి, తేనెను కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గుతుంది. చిన్నపిల్లలకు ఎక్కిళ్లు వస్తే వారిని బోర్లా పడుకోబెట్టి తడితే తగ్గిపోతాయి. 
 
నీళ్ళలో చక్కెర కలిపి చిన్నపిల్లలకు తాగించినా తగ్గిపోతుంది. ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటే నల్లతుమ్మచెట్టు ముళ్ళు 20 గ్రాములు నలగ్గొట్టి అరకప్పు మంచినీటిలో వేసి బాగా మరగబెట్టి దించి వడపోసి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తరువాత ఒక చెంచా తేనె కలిపి రెగ్యులర్‌గా తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు