వేసవిలో వచ్చే గ్యాస్, అసిడిటీ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి....

బుధవారం, 29 మే 2019 (20:40 IST)
వేసవి కాలంలో సహజంగానే గ్యాస్, అసిడిటీ సమస్యలు మనల్ని బాధిస్తాయి. మనం తిన్న ఆహారం ఈ కాలంలో త్వరగా జీర్ణం కాకపోవడం, జీర్ణాశయంలో మాటిమాటికీ గ్యాస్ ఉత్పన్నమవడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో వచ్చే గ్యాస్, అసిడిటీ సమస్యల నుండి తేలిగ్గా బయటపడటానికి కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
 
* గ్యాస్ స‌మ‌స్య‌ను తొల‌గించ‌డంలో అల్లం అద్భుత ఔషధంలా ప‌నిచేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలి లేదా చిన్న అల్లం ముక్క‌ను అలాగే న‌మిలి మింగాలి. దీంతో గ్యాస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
* పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ షోడా నీటి మిశ్రమంలో ఏదైనా తాగినట్లయితే సులభంగా గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు.
 
* వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వల్ల మనకు కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కాబట్టి నిత్యం తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే యాసిడ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఫలితంగా గ్యాస్ రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
* దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిల్లో ఏదైనా తింటే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
* భోజనానంతరం కనీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి. పడుకోకూడదు. అలా చేయని పక్షంలో గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు