చక్కెరతో బొద్దింకలకు ఎలా చెక్ పెట్టొచ్చు!

బుధవారం, 11 మే 2016 (10:18 IST)
సాధారణంగా ఇంట్లో బొద్దింకలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలోని అలమారాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని నిర్మూలించేందుకు వివిధ రకాలైన మందులను పిచికారి చేస్తుంటారు. కానీ, ప్రయోజనం మాత్రం పెద్దగా ఉందు. 
 
ఈ పరిస్థితుల్లో చక్కెరతో బొద్దింకలకు చెక్ పెట్చొచ్చు. పది గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడరు, పెద్ద చెంచా నిండుగా చక్కెర, అదే చెంచా నిండుగా పెరుగు, గోధుమ పిండి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయండి. ఈ ఉండలను అలమారాలు, ఫ్రిజ్ వెనుక భాగంలో, ఆహార పదార్థాలుంచే ప్రాంతంలో, వంట గదిలో ఉంచండి. దీంతో బొద్దింకల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి