అలాగే ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం ద్వారా వేసవిలో శరీరానికి మంచిది. పుదీనాను ఆహారంలో తీసుకోవడం ద్వారా మొటిమలను దూరం చేసుకోవచ్చు. గ్లాసు నీళ్లలో పుదీనా ఆకుల్ని... వేసి మరిగించాలి. ఈ నీళ్లని వడకట్టి... అందులో తేనె చేర్చి తీసుకున్నా ఫలితం ఉంటుంది. వేడి ప్రభావం తగ్గించుకోవాలంటే, తప్పనిసరిగా కనీసం రోజుకో కీరదోసకాయను తినాలి. కీరా ముక్కలు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడదు. అలానే కొబ్బరి నీళ్లు... చెరకురసం, బార్లీ నీటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా వేసవిలో నీరసం, అలసటను దూరం చేసుకోవాలంటే.. రోజూ పుచ్చకాయ తినాలి.
ఎండలో బయటకు వెళ్లి వచ్చాక నీళ్లకి బదులు నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసంలో చక్కెరకు బదులు తేనె చేర్చాలి. చల్లని పాలలో...చాక్లెట్, స్ట్రాబెర్రీ, కమలా ఫలం వంటివి ఏదో ఒకటి చేర్చి మిక్సీ చేయాలి. ఇలా తయారైన స్మూతీలో కాస్త తేనె చేర్చి ఉదయం పూట తీసుకుంటే ఎండ ప్రభావం మన మీద పడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.