జుత్తు పోషణకు అవసరమైన ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, జింక్, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం వెంటనే చేయాలి. వీటితో పాటు జీవన శైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి.
ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. చాలా కాలంగా మలబద్దకం కొనసాగుతూ ఉంటే ఆహారంలో పీచుపదార్థాల మోతాదు పెంచుకుని ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాగే, జుత్తుకు కావాల్సిన పోషకాలను అందించి.. వెంట్రుకలు రాలిపోవడం, బట్టపురి సమస్య నుంచి బయటపడవచ్చు.