ఇవి తెలిస్తే గోంగూర తినకుండా వుండరు
గోంగూర అంటే తెలుగువారిలో చాలామందికి అమితమైన ఇష్టం. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. గోంగూరలో చాలా మూలిక గుణాలున్నాయి. గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. గోంగూర పూల రసాన్ని వడగట్టి దాన్ని పాలలో కలిపి తీసుకుంటే రేచీకటి సమస్య పరిష్కారం అవుతుంది.
గోంగూర నుంచి జిగురు తీసి దాన్ని నీటిలో కలుపుకుని తాగితే విరేచనాలయ్యేవారికి ఉపశమనం కలుగుతుంది. శరీరంలోకి ఎక్కువగా నీరు చేరి ఆ సమస్యతో బాధపడేవారు గోంగూరను పథ్యంగా తీసుకుంటే ఫలితం వుంటుంది. బ్లడ్‌లో ఇన్సులిన్‌ను ఎక్కువగా పెంచగల శక్తి గోంగూరకు ఉంటుంది.
షుగర్‌తో ఇబ్బందిపడేవారు గోంగూరతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటే చాలా మంచిది. గోంగూరలో క్యాల్షియం ఉంటుంది, ఇది ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు గోంగూర తింటుంటే తగ్గిపోతాయి.