ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. అందుకే గోంగూరను ఆంధ్రమాత అని అంటారు. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువుగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధ పడేవారు గోంగూరను తింటే మంచి స్వస్థత చేకూరుతుంది.
గోంగూరలో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ తింటే అరగదు. కనుక జాగ్రత్త.
మూత్రపిండాలు లేదా మూత్రాశయంలోని రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు గోంగూరకి దూరంగా వుంటే మంచిది.