హిందూ, ముస్లిం సాంప్రదాయాలలో స్త్రీల వైవాహితకు గుర్తుగా మెట్టెలు తొడగడం ఆనవాయితి. అదీ ప్రత్యేకించి కాలి రెండో వేలుకు ధరించడం, అంతేకాకుండా వెండి ధాతువుతో తయారైనవే ధరించడం. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారపు మెట్టెలు వాడినా అది సంప్రదాయానికి వ్యతిరేకం అంటారు.
ఇక కాలు రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి అంటారు మోగా, ఆయుర్వేద నిపుణులు. నడిచే సమయంలో మెట్టెల ఘర్షణ ప్రేరితాలైన ఈ నాడీ కేంద్రాలు ఆరోగ్యవంతమైన, ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు.