శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే?

శనివారం, 30 డిశెంబరు 2017 (10:44 IST)
శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బరువును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. 
 
కివి పండులో సోడియం లెవల్స్‌ కూడా తక్కువే వుండటంతో హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. కివి పండులో పోలిక్‌ యాసిడ్‌ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. పోలిక్‌ యాసిడ్‌లు గర్భస్థ శిశువుల్లో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగినంత విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు