శ్వాస ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంలో చిన్న చిట్కాలు: సోహా అలీఖాన్‌

గురువారం, 25 నవంబరు 2021 (17:21 IST)
నవంబర్‌లో ఆకాశం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. పున్నమి వెన్నెల జాబిలి చూసిన తరువాత తక్షణమే ప్రకృతి ప్రేమలో పడిపోతాం. ఇంత అందాన్ని కనుల ముందుంచే ఈ నెలలోనే దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తుంటాయి. వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా మన శరీర  ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకంగానూ ఇది నిలుస్తుంది.

 
ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమప్తంగా ఉండేటటువంటి మాతృమూర్తి, బాలీవుడ్‌ సెలబ్రిటీ సోహా అలీఖాన్‌, గృహ చిట్కాల పట్ల అమిత నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి. సంప్రదాయంగా వినియోగించే పదార్థాలతో పాటుగా యోగా ప్రాక్టీస్‌ చేయడానికి అమితంగా ఇష్టపడతారామె. తమ కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని అమితంగా ఇష్టపడే ఆమె శ్వాస ఆరోగ్యం కోసం అమిత ప్రాధాన్యతనిస్తుంటారు. మరీముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు వంటి లక్షణాలను పోగొట్టుకోవడం కోసం ఆమె ఇంటి చిట్కాలనూ పాటిస్తుంటారు.

 
తన ఆరోగ్య రహస్యం గురించి సోహా మాట్లాడుతూ, ‘‘నవంబర్‌ అంటేనే కాస్త ఇబ్బంది పెట్టే నెల. అకస్మాత్తుగా వాతావరణం మారుతుంటుంది. మా కుటుంబ ఆరోగ్యం పట్ల పూర్తి ఆందోళన కూడా పడుతుంటాం. అయితే నా ఆందోళనను దూరంగా జరుపడంతో పాటుగా మా కుటుంబమంతటికీ ప్రీతిపాత్రమైనది విక్స్‌వాపోరబ్‌. సాధారణ జలుబు వంటి లక్షణాలతో పాటుగా ఒళ్లు నొప్పులు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది. ఎన్నో తరాలుగా మా  జీవితంలో విక్స్‌ అంతర్భాగమైంది’’ అని అన్నారు.

 
ఆమె మాట్లాడుతూ, ‘‘వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటంలో నా శరీరానికి కొంత సమయం అవసరం. అయితే మా కుటుంబంతో సరదాగా గడిపే ఎన్నో  ప్రత్యేక సందర్భాలు వచ్చే నెల కూడా ఇదే. అందువల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు నేను మా అమ్మ అడుగు జాడల్లో నడుస్తుంటాను. విక్స్‌ వ్యాపోరబ్‌తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్‌, కర్పూరం, పుదీనా వంటివి వినియోగించడం చేస్తాను. అంతేకాదు సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం తో నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాను’’ అని సోహా అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు