పిల్స్ వాడుతున్నారా? ఇన్ఫెక్షన్లు తప్పవ్.. వాటికి బదులు?

గురువారం, 25 మే 2017 (09:25 IST)
కుటుంబ నియంత్రణ కోసం పిల్స్ వాడుతున్నారా? యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా? అయితే ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. యాంటీ-బయోటిక్స్ వాడితే శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్ క్రమం తప్పుతుంది. దీంతో స్త్రీలల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో వైద్యుల్ని కలిసే మహిళలు.. ఎలాంటి బయోటిక్స్ వాడుతున్నారో వైద్యుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. 
 
గర్భిణులు, పాలిచ్చే తల్లులు యాంటీ బయోటిక్స్ వాడకూడదు. అలా వాడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. గర్భిణిలు, పాలిచ్చే తల్లులు దగ్గు, జలుబులాంటి సాధారణ రుగ్మతలకు గురైనప్పుడు సొంతంగా మందులు కొనుక్కుని వాడేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే ఆ తల్లితోపాటు, బిడ్డ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే పిల్స్ వాడే మహిళల్లో ఇన్ఫెక్షన్లు తప్పవని.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకే గర్భ నిరోధక మందుల్ని ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. 
 
అయితే యాంటీబయోటిక్స్ వాడకుండా ఉండాలంటే.. పెరుగు, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియా.. యాంటీబయాటిక్స్‌ వాడే పని లేకుండానే చిన్న చిన్న రుగ్మతలను నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మందులు తప్పనిసరిగా వాడాల్సివస్తే ఆ సమయంలో ఈ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఆ మందుల దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి