కారం అంటే ఇష్టపడే వారూ ఉంటారు ఇష్టపడని వారూ ఉంటారు. అయితే మిరపకాయలు తినడం వలన కొన్ని వ్యాధుల నుండి బయటపడవచ్చని ఆలాగే మరికొన్ని రోగాలు రాకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వలన ఆరోగ్యం మీ స్వంతం అవుతుందని మరియు ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అధిక బరువు సమస్య నుండి కూడా తప్పించుకోవచ్చు.
కొన్ని సంవత్సరాల పాటు కొన్న వేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. పండు మిరపకాయలు రోజువారీ ఆహారంలో తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని, వారికి రోగాలు వచ్చే అవకాశం తక్కువని తేలింది. కారం తక్కువగా తినేవారు రోగాలు నుండి తప్పించుకోవడం కష్టం అవుతోందని రుజువైంది. కారం ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని వీరు స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధకులు తెలిపారు.
మిరపకాయలో క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్‌లుండటం వలన బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచి ధమనుల గోడలలో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టి ఉంటే కూడా దానిని నివారించేందుకు మిరపకాయ ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.