తులసి విత్తనాలతో రోగాలు మటుమాయం! (video)

మంగళవారం, 5 నవంబరు 2019 (10:43 IST)
కేవలం తుల‌సి ఆకులు మాత్ర‌మే కాదు, తుల‌సి విత్త‌నాల్లోనూ ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. రోజు తుల‌సి విత్త‌నాల‌ను తింటే  ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. తుల‌సి విత్త‌నాల‌ను రోజూ తినడం వలన మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. 
* రక్తనాళల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిన వారు రోజూ తులసి విత్తనాలను తింటే మంచి ఫలితం ఉంటుంది. 
* తుల‌సి విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అలాగే 
 క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా చూస్తాయి. శ‌రీరంలో క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఈ యాంటీ 
ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి. 
 
* నిత్యం తుల‌సి విత్త‌నాల‌ను తినడం వలన హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని మన నిపుణులు 
 చేబుతున్నారు. అలాగే ఇందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 
 
* వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గాలంటే నిత్యం తులసి విత్తనాలను తినాలి. 
* తుల‌సి విత్త‌నాల్లో ఉండే విట‌మిన్ కంటి స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. అలాగే కంటిచూపును మెరుగు ప‌రుస్తుంది. 
* తులసిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పొగొడుతుంది. దాంతో వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు