వేపపూత తేనె మిశ్రమాన్ని కలిపి ప్రతిరోజూ తీసుకుంటే..

గురువారం, 20 అక్టోబరు 2016 (10:59 IST)
ఎండిన వేపపూతను చూసి తేనెలో వేసి ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తర్వాత ప్రతిరోజూ ఉదయాన ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫ దోషం పోయి జీర్ణశక్తిని కలిగించడమే గాకుండా ఆకలిని పుట్టిస్తుంది. 
 
వేపపూతకు బెల్లం, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా నీరు కలిపి నూరండి. దీనిని పచ్చడిలా ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే గాక జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. 
 
ఎండిన వేపపూతను దోరగా తగినంత నేతిలో వేయించి ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

వెబ్దునియా పై చదవండి