చాలాకాలంగా పొగతాగే అలవాటు గలవారిని దాన్ని వదలమంటే.. 'ఆ.. ఏం మానేస్తాం? ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం?' అని సాకులు చెబుతుంటారు. నిజానికి పొగ మానేసిన సమయం నుంచే క్యాన్సర్ ముప్పు తగ్గటమూ మొదలవుతుంది తెలుసా? పక్షవాతం, గుండె, ఊపిరితిత్తి జబ్బుల ముప్పులూ తగ్గుముఖం పడతాయి. పొగ మానటం వల్ల ఇవే కాదు. మరిన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
• దుస్తులు, జుట్టు, శ్వాస పొగ వాసన కొట్టవు. ఇది ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి దోహదం చేస్తుంది.