టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు)” అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా వున్న మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం, మిరాయ్ సినిమాల్లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు రక్షక్ చిత్రంతో మళ్లీ హీరోగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.