పకోడీల మాదిరి చికెన్ 65 ముక్కలను మనలో చాలామంది రుచి చూసే వుంటాం. వాటి తినడానికైతే బాగా తినేస్తాం కానీ దాని ద్వారా తెచ్చుకునే క్యాలరీలను కరిగించే పని మాత్రం చేయలేరు చాలామంది. అసలు చికెన్ 65 ద్వారా శరీరానికి అందే క్యాలరీలు, కొవ్వు... వివరాలతోపాటు చికెన్ 65 మంచి చేసేదెంత... చెడు చేస్తున్నదెంతో తెలుసుకుందాం.
పొటాషియం 87 మిల్లీ గ్రాములు, ఇది రోజువారీలో 2 శాతం. కార్బొహైడ్రేట్లు 10.3 గ్రాములు, ఇది రోజువారీలో 3 శాతం. ఫైబర్ 3.3 గ్రాములు, రోజువారీలో 13 శాతం వచ్చేస్తుంది. ఇలా చూసినప్పుడు చికెన్ 65 తీసుకోవడం ద్వారా విటమిన్ సి అత్యధికంగా అందుతుంది కానీ ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, సోడియం చేరుతుంది. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల చికెన్ 65 అనేది ఎప్పుడో ఒక్కసారి తినాలి తప్ప వారం కాగానే దాన్ని తింటూ ఉండకూడదు.