నిద్రలేదా..? మానసిక ఒత్తిడి పెరిగిపోతుందా? అయితే తప్పకుండా బరువు పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురైన సమయంలో అనాలోచితంగా జంక్ ఫుడ్ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారం అధిక మొత్తంలో తీసుకుంటారు. అలాగే యాంటీ డిప్రెసెంట్‌లను తీసుకోవడం ద్వారా కూడా బరువు పెరగవచ్చు.
అలాగే నిద్రలేమి ద్వారా శరీర బరువు పెరుగుతుంది. తగినంత నిద్రలేకపోవడంతో శరీరంలో హార్మోన్‌ల స్థాయుల్లో మార్పులు కలగడం వల్ల ఆకలి పెరుగుతుంది. తద్వారా అధికంగా తినేస్తుంటారు. తద్వారా ఒబిసిటీ తప్పదు. వ్యాయామాలు చేయకపోవటం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా బరువు పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.